చాంద్పూర్: అగ్ని-5 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని పరీక్షించారు.
ఈ ప్రయోగ పరీక్ష ద్వారా అన్ని రకాల సాంకేతిక, నిర్వాహక పారామితులను ధ్రువీకరించినట్టు రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.