పాస్‌పోర్ట్ సూచీలో దిగజారిన భారత్
మోదీ హయాంలో పలు కీలక అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారుతున్నది. తాజాగా హెన్లీ పాస్‌పోర్టు సూచీలో భారత్ మూడు ర్యాంకులు క్షీణించి 78వ స్థానానికి చేరుకుంది.
- 3 ర్యాంకులు పతనమై 78వ స్థానం
న్యూఢిల్లీ : మోదీ హయాంలో పలు కీలక అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారుతున్నది. తాజాగా హెన్లీ పాస్‌పోర్టు సూచీలో భారత్ మూడు ర్యాంకులు క్షీణించి 78వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ఇదివరకటి సూచీలో భారత్ 75వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం(ఐఏటీఏ) నుంచి సేకరించిన డాటా ఆధారంగా రూపొందించే ఈ సూచీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వీసా లేకుండా ప్రవేశం కల్పించే సామర్థ్యం ఆధారంగా పాస్‌పోర్టులకు ర్యాంకులను ఇస్తుంది.
192 గమ్యస్థానాలకు వీసారహిత ప్రవేశం కల్పిస్తూ సింగపూర్ ప్రపంచ పాస్‌పోర్టు ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత యూఏఈ, దక్షిణ కొరియా, జపాన్ ఉన్నాయి.
2006లో 71వ ర్యాంకు
భారత పాస్‌పోర్టు 2006లో 71వ ర్యాంకుతో తన అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇది బుర్కినా ఫాసో, క్యూబా, సెనెగల్‌తో కలసి 78వ స్థానాన్ని పంచుకుంటున్నది. హెన్లీ పాస్‌పోర్టు సూచీ ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలను మూల్యాంకనం చేస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత పాస్‌పోర్టు బలహీనపడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

