న్యూఢిల్లీ: ఇంగ్లిష్ స్పీకింగ్లో భారత్ స్థాయి మరింత మెరుగుపడిందని ‘పియర్సన్’ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు(54)ను మించి భారత్ స్కోర్(57) సాధించిందని నివేదిక పేర్కొన్నది. భారత్లో అత్యధికంగా ఢిల్లీ-63, రాజస్థాన్-60, పంజాబ్-58 స్కోర్ సాధించినట్టు తెలిపింది.
యూరప్, ఈజిప్ట్, జపాన్, ఫిలిప్పీన్స్, భారత్, కొలంబియా దేశాల్లో వివిధ టెస్ట్లు, డా టాను విశ్లేషించి రూపొందించిన ‘గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫిసియెన్సీ-2024’ నివేదికను పియర్సన్ సోమవారం విడుదల చేసింది. ఇంగ్లిష్ స్కిల్స్లో ప్రపంచ సగటు స్కోర్ 57 కాగా, భారత్ స్కోర్ 52కు పరిమితమైందని, ఇంగ్లిష్ రైటింగ్లో ప్రపంచ సగటు, భారత్ స్కోర్ 61 అని చెప్పింది.