న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 78,291 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 139.70 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ జరిగింది.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కు చేరింది. 236 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 104 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తెలంగాణలో 24, రాజస్థాన్లో 21, కర్ణాటకలో 19, కేరళలో 15, గుజరాత్లో 14 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
India reports 7,495 new #COVID19 cases, 6,960 recoveries, and 434 deaths in the last 24 hours.
— ANI (@ANI) December 23, 2021
Active cases: 78,291
Total recoveries: 3,42,08,926
Death toll: 4,78,759
Total Vaccination: 1,39,69,76,774
Total number of #Omicron cases 236 pic.twitter.com/CVRFJu1mXS
The total number of #Omicron cases in India rises to 236, of which 104 have recovered: Ministry of Health and Family Welfare #COVID19 pic.twitter.com/1JccWcCBlX
— ANI (@ANI) December 23, 2021