న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మరణాలు సంభవించాయి. అయితే మహారాష్ర్టలో గతంలో సంభవించిన మరణాలను నిన్నటి మరణాలతో కలిపారు. తాజాగా నమోదైన మరణాల సంఖ్య కేవలం 489 మాత్రమే. 36,977 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,12,16,337 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 4,07,170 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి 3,03,90,687 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 4,18,480కి చేరింది. ఇప్పటి వరకు 41,54,72,455 మంది కరోనా టీకా తీసుకున్నారు. వరుసగా 30 రోజుల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతంగా నమోదు కాగా, నిన్న 2.27 శాతంగా నమోదైంది.
India reports 42,015 new #COVID19 cases, 36,977 recoveries, and 3,998 deaths in the last 24 hours, as per the Union Health Ministry. Daily positivity rate at 2.27%, less than 3% for 30 consecutive days. pic.twitter.com/uDhIYgKOUn
— ANI (@ANI) July 21, 2021