న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124 మంది మరణించారు. మరో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ 3.24 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,71,830 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ మృతుల సంఖ్య 4,82,017కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 146.70 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. 766 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 568 కేసులు, ఢిల్లీలో 362, కేరళలో 185, రాజస్థాన్ లో 174, గుజరాత్ 152, తమిళనాడు 121, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63, ఒడిశాలో 37, పశ్చిమ బెంగాల్లో 20, ఏపీలో 17, మధ్యప్రదేశ్లో 9, యూపీ, ఉత్తరాఖండ్లో 8 చొప్పున, గోవాలో 5, చండీఘడ్, జమ్మూకశ్మీర్లో 3 చొప్పున, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, హిమాచల్ ప్రదేశ్, లఢఖ్, మణిపూర్, పంజాబ్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి.