న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజులపాటు 18 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, కొత్తగా ఆ సంఖ్య 22 వేలు దాటాయి. ఇది బుధవారం నాటికంటే 19 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కేరళలోనే 12 వేల కేసులు ఉన్నాయని తెలిపింది.
దేశంలో కొత్తగా 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్ వల్ల 4,49,856 మంది మృతిచెందగా, మరో 2,44,198 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 24,602 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. కొత్తగా 318 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో కేరళలో 12,616 కేసులు నమోదవగా, 134 మంది మృతిచెందారని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల్లో 43,09,525 మందికి వ్యాక్సినేషన్ చేశామని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 92,63,68,608 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించారు.