న్యూఢిల్లీ: ప్రైవేట్ కొరియర్ సర్వీస్‌లతో పోటీ పడేందుకు భారత తపాల శాఖ సిద్ధమవుతున్నది. 24 గంటలు, 48 గంటల డెలివరీ సమయపాలనతో ఉత్తరాలు, పార్సిల్స్ డెలివరీ చేసే హామీ ఆధారిత సేవను ప్రారంభిస్తామని కేంద్ర సమాచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం తెలిపారు.
ఇండియా పోస్ట్‌ను వ్యయ కేంద్రం నుంచి 2029 నాటికి లాభ కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆయన చెప్పారు. 24, 48 గంటల డెలివరీ, తదుపరి దినం పార్సిల్ డెలివరీ సౌకర్యాలను జనవరి నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.