దేశంలో బలమైన ప్రతిపక్షం లేదు… బలమైన ప్రతిపక్షం అవసరం : శ్రీశ్రీ రవిశంకర్
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతిపక్షం చాలా బలహీనంగా వుందన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కావాలంటే దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని స్పష్టం చేశారు. బలమైన ప్రతిపక్షం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కూడా అత్యావశ్యకమని రవిశంకర్ నొక్కి వక్కాణించారు.
దేశానికి ఓ బలమైన ప్రతిపక్షం కావాలి. అది నిర్మాణాత్మకంగా కూడా వుండాలి. ప్రస్తుత ప్రతిపక్షం చాలా బలహీనంగా వుంది. ఆ ప్రతిపక్షంలో నాయకత్వ సమస్య కూడా ప్రబలంగానే వుంది. ప్రతిపక్షం లేనిదే ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని పేర్కొన్నారు.
ఓ బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని భారత దేశం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే బెంగాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగాయని, న్యాయ వ్యవస్థ కూడా బలంగా వుందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఇవన్నీ సవ్యంగానే వున్నా.. బలహీనమైన ప్రతిపక్షం ఉందన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్షం లేని కారణంగా నిరంకుశత్వంలా కనిపిస్తోందని రవిశంకర్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

