Rafale deal | ఫ్రాన్స్ నుంచి మరో 114 యుద్ధ విమానాల కొనుగోలు.. లేఖను సిద్ధం చేసిన కేంద్రం
Rafale deal | వైమానిక దళాన్ని మరింత శక్తిమంతంచేసే దిశగా భారత రక్షణశాఖ (Difence Ministry) కీలక ముందడుగు వేసింది. ఫ్రాన్స్ (France) నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాల (Rafale fighter jets) కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రతిపాదన లేఖను కేంద్రం సిద్ధం చేసింది. రాబోయే కొన్నిరోజుల్లోనే ఆ లేఖను ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపించనున్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
Rafale deal : వైమానిక దళాన్ని మరింత శక్తిమంతంచేసే దిశగా భారత రక్షణశాఖ (Difence Ministry) కీలక ముందడుగు వేసింది. ఫ్రాన్స్ (France) నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాల (Rafale fighter jets) కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రతిపాదన లేఖను కేంద్రం సిద్ధం చేసింది. రాబోయే కొన్నిరోజుల్లోనే ఆ లేఖను ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపించనున్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ రక్షణ ఒప్పందంలో భాగంగా దాదాపు 90 యుద్ధ విమానాలను ‘మేకిన్ ఇండియా (Make in India)’ కింద ఇక్కడే తయారు చేయనున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్.. ఓ భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి వీటిని మన దేశంలోనే ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన విమానాలను మాత్రం నేరుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మన లేఖకు ఫ్రాన్స్ స్పందించిన తర్వాత అధికారికంగా టెండర్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. భారతదేశ రక్షణ అవసరాలకు సరిపోయేలా రఫేల్ విమానాల్లో కనీసం 50 శాతం మేర స్వదేశీ సాంకేతికత, విడిభాగాలను ఉపయోగించాలని ఢిల్లీ గట్టిగా పట్టుబడుతోంది. ఈ రఫేల్ ఉత్పత్తి ప్రక్రియలో భారతీయ కంపెనీల పాత్రను మరింత విస్తృతం చేయాలని ఫ్రాన్స్‌ను కోరింది.
భవిష్యత్తులో జరగబోయే రక్షణ సహకారాలు కేవలం కొనుగోళ్లకే పరిమితం కాకుండా ఇరు దేశాలు కలిసి డిజైన్, అభివృద్ధి చేసేలా ఒప్పందాలు ఉండనున్నాయి. భారత వైమానిక దళంలో ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. అలాగే నౌకాదళం కోసం మరో 26 రఫేల్-ఎమ్ విమానాల కొనుగోలు ప్రక్రియ కూడా నడుస్తోంది. ఇప్పటికే మనదేశంలో రఫేల్ విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్, శిక్షణ మౌలిక వసతులు ఉండటంవల్ల మరిన్ని కొత్త విమానాలు వస్తే వాటి రవాణా, నిర్వహణ ఖర్చులు, పైలట్ల శిక్షణ వ్యయం భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’ ఇప్పటికే ప్రాథమిక క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు పంపించబోయే లేఖకు ఫ్రాన్స్ నుంచి ధరలు, డెలివరీ సమయం, లాజిస్టిక్స్ మద్దతు వంటి వివరాలతో సమాధానం వస్తుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య తుది చర్చలు జరుగుతాయి. ఈ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయడానికి ముందు ప్రధాని నేతృత్వంలోని ‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ తుది ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

