శ్రీనగర్: పాకిస్థాన్ సైనిక విమానాలు వాడే నావిగేషన్ వ్యవస్థలను స్తంభింపచేయడానికి భారత్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను సరిహద్దుల్లో మోహరించింది. భారత జామింగ్ వ్యవస్థ యూఎస్, రష్యా, చైనాకు చెందిన జీపీఎస్, గ్లోనస్స్, బైదు నావిగేషన్ ప్లాట్‌ఫామ్‌లను నిరోధించే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ మూడు దేశాల నావిగేషన్ వ్యవస్థలను పాక్ సైన్యం వాడుతున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాక్ విమానాలు ఈ నెల 23 వరకు భారత గగనతలాన్ని వాడుకొనేందుకు అనుమతి లేదని కేంద్రం ప్రకటించిన వెంటనే జామింగ్ వ్యవస్థ ఏర్పాటు కావడం గమనార్హం.