శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 09:38:42

భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 5లక్షలు దాటింది. గత నాలుగు వారాల్లోనే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలో ఒక్కరోజే 5వేల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఒక్క మహారాష్ట్రలోనే 1,52,765 మంది కరోనా బాధితులున్నారు. 

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 18,552 మందికి వైరస్‌ సోకగా.. మరో 384 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,08,953కు చేరింది.  ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,97,387 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కోలుకొని 2,95,881 డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 15685కు పెరిగింది. జూన్‌ 26 వరకు 79,96,707 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. ఒక్క శుక్రవారమే  2,20,479 మందికి  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 


logo