శాంతి స్థాపనే ధ్యేయంగా.. నేడు భారత్-చైనా 11వ విడత చర్చలు
భారత్-చైనా| సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ భేటీ కీలకం కానుంది.

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ భేటీ కీలకం కానుంది. ఈ సందర్భంగా లడఖ్‌లోని గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ మైదానాల్లో ఘర్షణ పాయింట్ల నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకునే అంశంపై అధికారులు చర్చించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లడఖ్‌లోని చుషుల్ ప్రాంతంలో ఉన్న భారత్ శిబిరం వేదికగా సమావేశం ప్రారంభమవుతుంది. లేహ్ కేంద్రంగా పనిచేస్తున్న 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ భారత బృంధానికి నేతృత్వం వహిస్తున్నారు.
గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఇప్పటికే పలుమార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగాయి. ఇరుదేశాల సైనికుల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 19న పదో విడుత సమావేశం జరిగింది. చైనా భూభాగంలోని మాల్డో పోస్టు వద్ద జరిగిన ఈ చర్చల అనంతరం పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరు మృతి
శంషాబాద్‌లో విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత
రాష్ట్రానికి నేడు వర్ష సూచన
ఢిల్లీలో 37 మంది వైద్యులకు కరోనా
కలిసి తింటే కలదు ఆరోగ్యం
కాశీ జ్ఞాన్వాపీ మసీదు కింద ఆలయం ఉండేదా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

