NEET Re-Exam: జూన్ 22 వరకు టెలిగ్రాం యాప్ బ్లాక్.. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో నిర్ణయం
NEET Re-Examination: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రాం యాప్‌ను ఇండియా బ్లాక్ చేసింది. జూన్ 22వ తేదీ వరకు టెలిగ్రాం యాప్ అందుబాటులో ఉండదు. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ రీ-ఎగ్జామ్( NEET Re-Examination) నేపథ్యంలో టెలిగ్రాం యాప్‌ను ఇండియా బ్లాక్ చేసింది. జూన్ 22వ తేదీ వరకు టెలిగ్రాం యాప్ అందుబాటులో ఉండదు. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక జూన్ 30వ తేదీ వరకు టెలిగ్రాం యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా ప్రభుత్వం డిజైబుల్ చేసింది. ఎగ్జామ్ మెటీరియల్‌ను లీకేజీ చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు చేపట్టింది. మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన యాప్‌ను తక్షణమే బ్లాక్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఈ చర్య చేపట్టారు. కేవలం ఎగ్జామినేషన్ పీరియడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ యాప్‌ను రద్దు చేశారు. పేపర్ లీక్ ఘటనలను తగ్గిచేందుకు ఎడిటింగ్ ఫీచర్లను డిజైబుల్ చేశారు. గతంలో పోస్టు చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసి ఆప్షన్ ప్రస్తుతం 30వ తేదీ వరకు బ్లాక్ చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడుతున్న చీటింగ్ ముఠాలు టెలిగ్రాం యాప్‌ను విరివిగా వాడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నీట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆ చీటింగ్ ముఠా టార్గెట్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పేపర్ లీకేలకు చెందిన అనేక ఛానళ్లను, గ్రూపులను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

