మోదీ, షా తప్పించుకోలేరు
ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఓటుచోరీపై విపక్షాలు గళమెత్తాయి. కేంద్రంతో కుమ్మక్కైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పౌరుల ఓట్లను అపహరించారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాము పోరాటం చేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు.
- సీఈసీ తర్వాత మీపైనే మా గురి
- జ్ఞానేశ్ కుమార్‌ను జైలుకు పంపుతాం
- 2024 ఎన్నికలు చట్టవిరుద్ధం
- ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన
న్యూఢిల్లీ, నవంబర్ 1: ఓట్ చోరీ ఆరోపణల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఓటుచోరీపై విపక్షాలు గళమెత్తాయి. కేంద్రంతో కుమ్మక్కైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పౌరుల ఓట్లను అపహరించారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తాము పోరాటం చేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు.
భవిష్యత్‌లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి దేశద్రోహం కేసుల్లో జైలుకు పంపుతామని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని కార్యక్రమంలో ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పు దొంగిలించి కేంద్రంలోనూ, పలు రాష్ర్టాల్లో బీజేపీ అధికారాన్ని చేపట్టిందని విమర్శించారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేసిన ఓట్ల చోరీకి సంబంధించి మీపై చర్యలుంటాయన్న సంగతిని మరువొద్దు. జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీపైనే మా గురి’ అని ఆయన అన్నారు.
రాబోయే మార్పునకు సూచిక
అశేష ప్రజానీకంతో రామ్‌లీలా మైదానం ప్రజాస్వామ్యానికి సంబంధించిన ‘హల్దీఘాటీ యుద్ధభూమి’గా మారిందని, ఇది రాబోయే మార్పునకు సూచిక అని ఎస్పీ అధినేత అఖిలేశ్ పేర్కొన్నారు. సీజేపీ నాయకత్వానికి, జెన్‌జీ ఆందోళనకు తాను మద్దతు ఇస్తున్నట్టు మాజీ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్లో ఎన్నికలను అపహరించారని ఆరోపించారు.
బీజేపీ కౌంటర్ ర్యాలీలు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీకి పోటీగా బీజేపీ దేశవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తరిమికొట్టండి’ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి నేతృత్వంలో హరి నగర్ నుంచి తిలక్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనిలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధిత కుటుంబాలు సహా సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. నవంబర్ ఒకటిన రాజకీయ ర్యాలీ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ సిక్కుల గాయాలను మళ్లీ గుర్తు చేస్తున్నదని బీజేపీ నేతలు విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ హర్యానాలోని రోహ్తక్ ర్యాలీకి నాయకత్వం వహించారు. 1984 అల్లర్ల బాధితులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా మాట్లాడుతూ సిక్కు బాధితులను గుర్తు చేసుకోవాల్సిన రోజున రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం ర్యాలీని నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

