న్యూఢిల్లీ, జూన్ 6 : రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగే చమురు డిమాండ్‌లో సగం వాటా భారత్‌దే కానున్నదని రోజ్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ పేర్కొన్నారు. శనివారం సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ చమురు మార్కెట్లో భారత్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నదని తెలిపారు.
వచ్చే దశాబ్ద కాలంలో చమురుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని, ఆ డిమాండ్‌లో సగం వాటా భారత్‌దేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2035 నాటికి భారత్‌లో చమురు వినియోగం 44% వృద్ధితో ప్రతి రోజు సుమారు 80 లక్షల బ్యారెళ్లకు చేరుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ వృద్ధి ఐదు శాతం లోపే ఉంటుందన్నారు.