హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న యువతరం సినిమా ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈసినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. యువతరం మెచ్చే యూత్‌ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా ఈ సినిమా రాబోతున్నదని ఫస్ట్‌లుక్ చెబుతున్నది.
ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, యువతకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి రచన: నందు సవిరిగన, కెమెరా: కేవీ గుహన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణం: అరుణాచల క్రియేషన్స్.