‘ది నైట్ ఆఫ్ ది స్టార్స్’ పేరుతో ఈ నెల 12న హైదరాబాద్లో సంగీత విభావరి జరగనుంది. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్, సింగర్స్ గీతా మాధురి, సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి, భార్గవి తమ పాటలతో అలరించబోతున్నారు యూట్యూబర్ విజయేంద్ర సింహ ఈ వేడుకను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 23ఏళ్ల తర్వాత కల్యాణి మాలిక్ ఆధ్వర్యంలో మ్యూజిక్షోను నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇందులో నోస్టాల్జిక్ పాటల్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని తెలిపారు.
తన మొదటి సినిమా ‘ఐతే’ విడుదలైనప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో.. ఈ షో విషయంలో అంతే హ్యాపీగా ఉన్నానని, తప్పకుండా ప్రేక్షకుల్ని అలరించే మ్యూజిక్ షో అవుతుందని కల్యాణి మాలిక్ పేర్కొన్నారు.