Income Tax Rides | కర్నాటకలో ఆదాయపు పన్నుశాఖ దాడులు సోమవారం కొనసాగాయి. ఓ కాంట్రాక్టర్‌తో పాటు అతని కొడుకు, జిమ్ ఇన్స్ట్రక్టర్, ఆర్కిటెక్ సహా పలువురి నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు వివరణ ఇచ్చింది. అలాగే పలుచోట్ల ప్రభుత్వ కాంట్రాక్టర్లతో పాటు మరికొందరు వ్యక్తులపై ఐటీశాఖ దాడులు నిర్వహించి.. లెక్కల్లో చూపని రూ.94కోట్ల నగదుతో పాటు రూ.8కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, 30 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీడీటీ (CBDT) ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, అక్టోబర్ 12 నుంచి దాడులు 55 ప్రదేశాల్లో దాడులు నిర్వహించామని, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీతో పాటు పలుచోట్ల ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ సోదాల్లో సుమారు రూ.94కోట్ల నగదు, రూ.8కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు పేర్కొంది. అదే సమయంలో ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద సుమారు 30 విదేశీ బ్రాండ్లకు చెందిన లగ్జరీ చేతి గడియారాలను సీజ్ చేసినట్లు వివరించింది.