Bastar: మావో నేత హిడ్మా గ్రామంలో ఓటు వేయని స్థానికులు
Bastar: చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపు ఇచ్చినా.. చాలా వరకు గ్రామాల్లో ప్రజలు ఓట్లు వేశారు. కానీ కరుడుకట్టిన నక్సల్ నేత హిడ్మాకు చెందిన పువర్తి గ్రామంలో ప్రజలు ఎవరూ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
సుక్మా: చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్(Bastar) లోక్‌సభ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపు ఇచ్చినా.. చాలా వరకు గ్రామాల్లో ప్రజలు ఓట్లు వేశారు. కానీ కరుడుకట్టిన నక్సల్ నేత హిడ్మాకు చెందిన పువర్తి గ్రామంలో ప్రజలు ఎవరూ ఓటు హక్కును వినియోగించుకోలేదు. బస్తర్ ప్రాంతంలో జరిగిన అనేక నక్సల్స్ దాడుల్లో హిడ్మా పాత్ర ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆ నియోజకవర్గంలో 67.56 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కానీ పువర్తి గ్రామ పోలింగ్ బూత్ నుంచి ఎవరూ ఓటు హక్కును వాడుకోలేదని తెలిసింది. భయం వల్ల గ్రామస్థులు ఓటు వేయలేదని బూత్ లెవల్ ఆఫీసర్ తెలిపారు. పువర్తి పోలింగ్ బూత్ కింద మూడు గ్రామాలు ఉన్నాయి. దాంట్లో పువర్తి, టేకల్‌గూడమ్, జొన్నగూడ ఉన్నాయి. పువర్తిలో 332 మంది, టేకుల్‌గూడంలో 158 మంది, జొన్నగూడలో 157 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పువర్తి గ్రామంలో ఉన్న బూత్ నుంచి ఒక్కరు కూడా ఓటు వేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bastar
- Hidma
- LS seat
- Maoist leaders
RELATED ARTICLES
తాజా వార్తలు
Maths | కొందరు పిల్లలు చిన్నతనం నుంచే గణితంలో నైపుణ్యం కలిగి ఉంటారు, కొందరు ఉండరు.. ఎందుకు..?
Amit Shah | ఆ విషయంలో కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
Brs Party | బీఆర్ఎస్లో చేరిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

