Cows Walk Over Devotees | దీపావళిలో మరో ప్రత్యేకత.. ఆ గ్రామంలో భక్తుల పైనుంచి నడిచిన ఆవులు
Cows Walk Over Devotees | దీపావళి సందర్భంగా ఒక గ్రామంలో ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. నేలపై పడుకున్న భక్తుల పైనుంచి ఆవులను నడిపించారు. (Cows Walk Over Devotees) ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: దీపావళి సందర్భంగా ఒక గ్రామంలో ప్రత్యేక సంప్రదాయాన్ని పాటించారు. నేలపై పడుకున్న భక్తుల పైనుంచి ఆవులను నడిపించారు. (Cows Walk Over Devotees) ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భిదావద్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఒక సంప్రదాయం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా దీపావళి మరునాడైన సోమవారం గ్రామస్తులు ఆవులను పూజించారు. అనంతరం నేలపై బోర్లా పడుకున్న భక్తుల పైనుంచి ఆ ఆవులను నడిపించారు. ఇలా చేస్తే గోమాతలో ఉండే 33 కోట్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని ఆ గ్రామస్తులు నమ్ముతారు.
కాగా, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి ముందు భక్తులు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. ఐదు రోజులపాటు ఉపవాసం ఉంటారు. దీపావళి ముందు రోజు గుడిలో భజనలు చేస్తారు. ఆ రాత్రిపూట అక్కడ నిద్రిస్తారు. దీపావళి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి తర్వాత రోజు డప్పు వాయిద్యాలతో అంతా ఒక చోట చేరుతారు. ఉపవాసం ఉండే భక్తులు నేలపై పడుకుంటారు. వారి పైనుంచి ఆవులను నడిపిస్తారు. ఆ తర్వాత వారుపైకి లేస్తారు. ఈ వేడుక చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు ఆ గ్రామానికి తరలివచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Devotees let cows trample them as a part of a tradition in village Bhidavad of Badnagar tehsil, Ujjain district in Madhya Pradesh
The ritual is performed on the next day of Diwali. Devotees believe that by doing this their wishes will come true. pic.twitter.com/evwikt8HJC
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

