Fire accident: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సోలన్ జిల్లాలోని బడ్డి పారిశ్రామిక వాడలోగల ఓ కాస్మెటిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువురు వర్కర్స్ ఫ్యాక్టరీ లోపలే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నాలాగఢ్ సహా సమీపంలోని పలు ప్రాంతాల నుంచి పలు ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయని సోలన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మన్మోహన్ శర్మ చెప్పారు. ఒక NDRF టీమ్ కూడా ఘటనా ప్రాంతానికి చేరుకుందని తెలిపారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న వర్కర్స్ ప్రాణభయంతో భవనం పై అంతస్తుకు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారని ఆయన వెల్లడించారు.
ఫ్యాక్టరీలో చిక్కుకున్న 41 మందిని రెస్క్యూ టీమ్స్ బయటికి తీసుకొచ్చాయని, వారిలో 19 మందికి కాలిన గాయాలయ్యాయని మన్మోహన్ శర్మ తెలిపారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. కాగా, ఫ్యాక్టరీలో కాస్మెటిక్ మెటీరియల్ ఉండటంతో పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయని, దాంతో మంటలు ఆర్పడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు.
#WATCH | 41 people including 19 injured people were rescued after a fire broke out in a perfume factory in the Baddi area of Solan district today; Teams of NDRF and Fire Department engaged in the operation to rescue affected persons and douse fire#HimachalPradesh pic.twitter.com/A1l6ypP5HI
— ANI (@ANI) February 2, 2024