జైపూర్: ఇద్దరు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang Raped) బాలిక పేరెంట్స్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను ఆమె ఇంటి వద్ద వదిలేశారు.
కాగా, బాధిత బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ సమక్షంలో బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వన్నా రామ్, దశరథ్గా పోలీసులు గుర్తించారు. వారి కోసం వెతికి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.