Dalit man beaten to death | మధ్యప్రదేశ్‌లో మరో దారుణం.. దళిత వ్యక్తిని కొట్టి చంపారు, అతడి తల్లిని వివస్త్రను చేశారు
Dalit man beaten to death | దళిత వ్యక్తిని కొందరు కొట్టి చంపారు (Dalit man beaten to death). అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
భోపాల్: దళిత వ్యక్తిని కొందరు కొట్టి చంపారు (Dalit man beaten to death). అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. దళిత యువతిపై లైంగిక వేధింపులకు సంబంధించి 2019లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని ఒక కుటుంబాన్ని కొందరు వ్యక్తులు బెదిరించారు. గురువారం అగ్రవర్ణాలకు చెందిన 9 మంది వ్యక్తులు ఆ ఇంటికి వెళ్లి హంగామా చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు.
ఆ తర్వాత బస్టాండ్ వద్ద ఉన్న 18 ఏండ్ల నితిన్ అహిర్వార్ వద్దకు వారు వెళ్లారు. అతడి సోదరి ఫిర్యాదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. నిరాకరించిన అతడ్ని దారుణంగా కొట్టి చంపారు. ఇంతలో యువకుడి తల్లి పరుగున అక్కడకు చేరుకున్నది. కుమారుడ్ని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వ్యక్తులు ఆమెను కూడా కొట్టారు. అలాగే ఆమె దుస్తులను లాగేశారు. అత్యాచారం చేస్తామని ఆమె కుమార్తెను బెదిరించడంతో భయంతో ఆమె పారిపోయింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
మరోవైపు కలకలం రేపిన ఈ సంఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. దళితులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ, ఆ ప్రభుత్వ ద్వంద స్వభావాన్ని ఇది ప్రతిబింబిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా దళిత యువకుడి హత్యను ఖండించారు. మధ్యప్రదేశ్‌ను దళిత వివక్ష ప్రయోగశాలగా బీజేపీ మార్చిందని దుయ్యబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

