భోపాల్: ఒక కాలేజీ ప్రిన్సిపాల్‌పై ప్రొఫెసర్ దాడి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జాయిని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బ్రహ్మదీప్ అలునే అనే అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇటీవల భోపాల్ నుంచి ఘట్టియాలోని నాగులాల్ మాలవ్య ప్రభుత్వ కాలేజీకి బదిలీ అయ్యారు. అయితే ఆయన రోజూ కాలేజీకి వచ్చిన తర్వాత 5 కిలోమీటర్ల మేర నడిచేవారు. అసలే సిబ్బంది తక్కువగా ఉండటంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ చర్య కాలేజీ ప్రిన్సిపాల్‌కు తలనొప్పిగా మారింది. ఈ నెల 14న ఆ కాలేజీలో వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో ఖాళీ సమయం లభించడంతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ బ్రహ్మదీప్ను ప్రిన్సిపాల్ తన గదికి పిలిచారు. కాలేజీకి వచ్చిన తర్వాత రోజూ వాకింగ్ వెళ్లి సమయం వృధా చేస్తుండటాన్ని నిలదీశారు.
దీంతో ఆగ్రహించిన ప్రొఫెసర్ బ్రహ్మదీప్, ప్రిన్సిపాల్‌పై దాడి చేశాడు. ఆయన తన కుర్చీ నుంచి లేచి వెనక్కి వెళ్లగా టేబుల్‌పై ఉన్న వస్తువులను ప్రిన్సిపాల్‌పై విసిరాడు. అనంతరం ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి దాడి చేశాడు. అరుపులు విన్న బయట ఉన్న కొందరు ప్రిన్సిపాల్ రూమ్‌లోకి వచ్చి ఇద్దరిని విడిపించారు. ఈ ఘటన నేపథ్యంలో తన గది నుంచి బయటకు వెళ్లాలని ప్రొఫెసర్‌తో ప్రిన్సిపాల్ అన్నారు. అయితే దుర్భాషలాడిన ఆ ఫ్రొఫెసర్ తాను వెళ్లనంటూ అక్కడ కుర్చీలోనే కూర్చొన్నాడు. ఆ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక పలువురు ఆ కాలేజీ నుంచి వెళ్లిపోయారంటూ ఆయన ఆరోపించాడు.
మరోవైపు ప్రిన్సిపాల్ గదిలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన ప్రొఫెసర్ బ్రహ్మదీప్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
An assistant professor was booked for allegedly beating up principal of a Government College in Ujjain @ndtv @ndtvindia pic.twitter.com/egom5OIVjA
— Anurag Dwary (@Anurag_Dwary) January 19, 2022