Police notice to BJP MLA | దిశా మృతి కేసులో.. బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు పోలీస్ నోటీస్
Police notice to BJP MLA | సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు ముంబై పోలీసులు నోటీస్ జారీ చేశారు. జూలై 12న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సమన్లు జారీ చేశారు.
ముంబై: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు ముంబై పోలీసులు నోటీస్ జారీ చేశారు. (Police notice to BJP MLA) జూలై 12న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సమన్లు జారీ చేశారు. దిశా మరణం గురించి ఆయన చేసిన ఆరోపణలపై ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని పోలీసులు ప్రశ్నించనున్నారు. ముంబై పోలీసుల నోటీస్‌పై బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే స్పందించారు. దిశా మిస్టరీ మరణానికి సంబంధించిన ఆధారాలు అందజేస్తానని తెలిపారు. ‘నాకు ఇప్పుడే సమన్లు అందాయి. ఇది హత్య కేసు అని తొలి రోజు నుంచి చెబుతున్నా. ముంబై పోలీసులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఆదిత్య ఠాక్రే, ఆయన స్నేహితులను కాపాడేందుకు గత ఎంవీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. నా వద్ద ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని అన్నారు.
కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని కనిపించడానికి కొన్ని రోజుల ముందు, ఆయన మాజీ మేనేజర్ 28 ఏళ్ల దిశా సాలియన్ 2020 జూన్ 14న అనుమానాస్పదంగా మరణించింది. మలాడ్‌లోని ఎత్తైన భవనం 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అనుమానం లేదని ఆమె తండ్రి చెప్పారు. దీంతో దిశ మరణాన్ని ప్రమాదంగా పేర్కొన్న మల్వానీ పోలీస్ స్టేషన్ ఆ కేసును మూసివేసింది.
మరోవైపు దిశాది హత్య కేసు అని, ఆదిత్య ఠాక్రే, ఆయన స్నేహితుల ప్రమేయం ఉందని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ఆరోపించారు. పోలీస్ అధికారి చిమాజీ ఆధవ్ కేసును సరిగా దర్యాప్తు చేయలేదని గత ఏడాది డిసెంబర్లో విమర్శించారు. ఈ నేపథ్యంలో షిండే ప్రభుత్వం ఆదేశాల మేరకు దిశా మరణంపై మళ్లీ దర్యాప్తు కోసం సిట్‌ను ముంబై పోలీసులు ఏర్పాటు చేశారు.
#WATCH | BJP leader Nitesh Rane says, "I have just received the summons and I have been saying this since day one that this is a case of murder. I am ready to cooperate with the Mumbai Police. The MVA government wanted to do a cover-up & save Aditya Thackeray and his other… https://t.co/BkiqPWTdit pic.twitter.com/xSh3mMHvh1
— ANI (@ANI) July 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

