న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జాంగ్‌పుర ప్రాంతంలో ఉన్న ఉమ్రావో జ్వలరీ షాపులో గత ఆదివారం రాత్రి దొంగలు పడిన విషయం తెలిసిందే. ఆ జ్వలరీ షాపులో ఉన్న సుమారు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఆ జ్వలరీని ఎత్తుకెళ్లిన ఇద్దర్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్‌ఘడ్‌లోని దుర్గలో ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. ఆ ఇద్దరి వద్ద నుంచి సుమారు 12.50 లక్షల నగదు, 18 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జ్వలరీ షాపులో చోరీ చేసిన కేసులో బంగారాన్ని, నగదును సీజ్ చేసినట్లు బిలాస్పూర్ ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు.
#WATCH | Delhi: Latest visuals from the jewellery shop which was looted in Delhi’s Bhogal area.
Two persons have been detained in the case, from Chhattisgarh. Their interrogation is underway. Rs 12.50 lakh in cash and over 18kg of gold and diamonds have been seized from one of… pic.twitter.com/G8WQoLJyeM
— ANI (@ANI) September 29, 2023
చోరీ చేయడానికి ముందు దొంగలు ఆ బిల్డింగ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేశారు. లాకర్లు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి మరీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. నాలుగు అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్‌లోకి పై అంతస్తు నుంచి దొంగలు ప్రవేశించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను పగలగొట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. అక్కడ ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్‌లో డిస్ప్లేలో ఉన్న బంగారన్ని కూడా ఎత్తుకెళ్లారు. షోరూమ్ తాజా విజువల్స్‌ను కూడా రిలీజ్ చేశారు.
#WATCH | Bhogal jewellery shop theft | Two persons have been detained in the case, from Chhattisgarh. Their interrogation is underway.
Rs 12.50 lakh in cash and over 18kg of gold and diamonds have been seized from one of the accused, in Durg.
(Visuals from Durg, Chhattisgarh) pic.twitter.com/vXqClRo1uU
— ANI (@ANI) September 29, 2023
ఈ కేసులో మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితుల్లో లోకేశ్ శ్రీవాత్సవ్, శివ చంద్రవంశీతో పాటు మరో పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు. ఆ ముగ్గురి నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌తో పాటు ఏపీలోనూ ఆ దొంగలు ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.