ముంబై : నవరాత్రుల వేడుకలు ముగిసినా పండగ స్ఫూర్తి పలువురి మదిలో ఇంకా నిండి ఉంది. ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ ఉత్సాహం చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ముంబైలోని అర్కడే ఎర్త్ హౌసింగ్ సొసైటీలో జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డెలివర్ చేసిన తర్వాత గర్భా డ్యాన్స్ చేసిన వీడియోను ఆశిష్ మూలె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ క్లిప్ సింపుల్‌గా ఉన్నా అందరిలో ఉత్తేజం, పండగ స్ఫూర్తిని నింపుతున్నది. బ్యాక్‌గ్రౌండ్‌లో హుషారైన సంగీతం వినపడుతుండగా డెలివరీ ఏజెంట్ గర్భా మూమెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వర్కింగ్ ఆన్ గర్భా నైట్స్? ఎంజాయ్ ఎవిరి మొమెంట్ ఆఫ్ లైఫ్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ క్లిప్‌ను ఇప్పటివరకూ 1.9 లక్షల మంది లైక్ చేయగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. సమాజంలో పండుగలు ప్రతి ఒక్కరినీ ఎలా ఏకం చేస్తాయనేది ఈ వీడియో వెల్లడిస్తోందని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు.