న్యూఢిల్లీ : ఏనుగులు, మనుషుల మధ్య అనుబంధం చూపే ఎన్నో వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. ఇబ్బందికర పరిస్ధితుల్లో చిక్కుకున్న ఏనుగులను మనుషులు కాపాడి ఆపన్న హస్తం అందిస్తుంటారు. ఈ తరహా వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
She helped the elephant baby to come out from the mud it was struck in. Baby acknowledges with a blessing 💕 pic.twitter.com/HeDmdeKLNm
— Susanta Nanda IFS (@susantananda3) October 27, 2022
ఈ వీడియోలో ఓ పిల్ల ఏనుగు బురదతో కూడిన సైడ్ వాక్‌లో కూరుకుపోతుండగా ఓ మహిళ ఏనుగు కాలు పట్టుకుని బయటకు లాగి సాయం చేస్తుండటం కనిపించింది. మట్టిలో నుంచి పిల్ల ఏనుగును మహిళ కాపాడగా పిల్ల ఏనుగు ఆమెను బ్లెస్ చేసిందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 63,000కు పైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. బేబీ ఎలిఫెంట్‌ను కాపాడిన మహిళను పలువురు ప్రశంసించారు.