న్యూఢిల్లీ : సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళ రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 38,000కు పైగా వ్యూస్ లభించాయి. వైరల్ వీడియోలో ఇద్దరు మహిళలు బైక్పై దూసుకువెళుతుండటం కనిపించింది.
बुलेट रानी 🏍️🥰 pic.twitter.com/zoImjrEXvS
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 27, 2022
సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళ బైక్ నడుపుతుండగా మరో మహిళ వెనుక కూర్చున్నారు. బైక్ రోడ్డు మధ్యలో దూసుకెళుతుండగా ఈ వీడియోను మరొకరు రికార్డు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించగా మరికొందరు యూజర్లు మహిళకు హెల్మెట్ లేదని అభ్యంతరం తెలిపారు.
కొత్త తరం మహిళలను చూసి గర్విస్తున్నామని ఓ యూజర్ రాసుకొచ్చారు. వీడియోలో బైక్ నడిపిన మహిళ తీరును ఓ యూజర్ మెచ్చుకుంటూ ఆమె హెల్మెట్ దరిస్తే బాగుండేదని సూచించారు.