న్యూఢిల్లీ : ఆటో డ్రైవర్ స్కెచ్‌ను గీసి అతడికి బహుకరించిన మహిళ వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన స్కెచ్‌ను రిసీవ్ చేసుకున్న ఆటో డ్రైవర్ ముఖంపై నవ్వులు విరబూయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వైరల్ వీడియోను దీక్ష అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలోని ఆర్ట్ కార్ట్ బై దీక్ష పేజ్‌లో షేర్ చేసింది.
ఈ వీడియోలో దీక్ష ఆటోలో ప్రయాణిస్తుండగా డ్రైవర్ స్కెచ్‌ను డ్రా చేయడం కనిపిస్తుంది. ఆపై మూడు నిమిషాల్లో తన రైడ్ ముగియగా స్కెచ్‌ను ఆటో డ్రైవర్‌కు ఆమె అందచేసింది. తన స్కెచ్‌ను చూసుకున్న ఆటో డ్రైవర్ ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యాడు. ఏ ఆటోలు అక్కడ ఆపని సమయంలో అతడు తనను పిక్ చేసుకున్నాడని, అందుకు అతడికి ధన్యవాదాలు చెబుతూ స్కెచ్ గీశానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ క్లిప్‌ను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ పది లక్షలు పైగా వ్యూస్ లభించాయి. దీక్ష ఆటోడ్రైవర్‌కు ధన్యవాదాలు తెలిపిన తీరుకు నెటిజన్లు ముగ్ధులయ్యారు. ఇది దీక్ష క్యూట్ గెశ్చర్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, సామాన్యుడి ముఖంలో నవ్వులు పూయించారని మరో యూజర్ ప్రశంసలు గుప్పించారు.
Read More
Ashu Reddy | గులాబీ డ్రెస్‌లో ఆషూ అందాల జాతర..