న్యూఢిల్లీ : మన సంప్రదాయ వివాహాలంటేనే ఎంతో హంగామా, సందడి కనిపిస్తుంటుంది. భారత్‌లో ఏ మూల చూసినా బరాత్‌ల బ్యాండ్ బాజాలు మోగుతూనే ఉంటాయి. అయితే ఇలాంటివి అమెరికాలో మరో దేశంలోనో జరగడం అరుదు.
అలాంటిది పలువురు భారత సంతతికి చెందిన అమెరికన్లు సంప్రదాయ దుస్తుల్లో న్యూయార్క్ వీధిలో డ్యాన్స్‌లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెండ్లి ఊరేగింపులో పలువురు ఇండో అమెరికన్లు సంప్రదాయ దుస్తుల్లో భారతీయ పాటలకు హుషారుగా స్టెప్పులు వేస్తున్న వీడియోను సూరజ్ పటేల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
హుషారైన పాటలకు అక్కడున్న వారంతా పదం కలపడం ఈ వీడియోలో ఆకట్టుకుంటుంది. పెండ్లి ఊరేగింపులో వధూవరులు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. తన సోదరుడి వివాహంలో న్యూయార్క్ వీధుల్లో తామంతా ప్రేమతో ఉత్సాహంతో ఎంజాయ్ చేశామని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఇక ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. పెండ్లంటే ఇది కదా అంటూ కామెంట్ చేశారు.