న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టమాట ధరలు మంటెత్తిస్తూనే ఉన్నాయి. టమాట కిలో (Tomato Price Hike) ఏకంగా రూ. 150 దాటి పరుగులు పెడుతున్నది. నిత్యావసర కూరగాయ ధరలు ఆకాశానికి అంటుతుండటంతో మగువలు చాలావరకూ టమాట లేకుండానే వంటను ముగిస్తున్నారు. ఇక టమాట ధరలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ సందడి చేస్తున్నాయి. ఇక లేటెస్ట్గా కంటెంట్ క్రియేటర్ కుషాల్ టమాట ధరల పెంపుపై ఓ పేరడీ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వీడియోలో కుశాల్‌తో పాటు పలువురు వ్యక్తులు పేరడీ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తూ కనిపించారు. ప్రముఖ తమిళ సాంగ్ తుమ్ తుమ్ సాంగ్‌కు పేరడీ లిరిక్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. రోజువారీ వంటకాల్లో మనం వాడే టమాట ధర మోతెక్కడం గురించి ఈ సాంగ్ లిరిక్స్ ప్రస్తావిస్తాయి. ఈ వీడియోకు నెట్టింట ఇప్పటివరకూ ఏకంగా 4.53 లక్షల లైక్‌లు రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు.
మధ్యతరగతి కష్టాలను కుశాల్ తన పేరడీ సాంగ్‌లో అద్భుతంగా వర్ణించారని పలువురు యూజర్లు ప్రశంసించారు. వినూత్న కాన్సెప్ట్‌తో కంటెంట్ క్రియేటర్ ముందుకొచ్చారని మెచ్చుకున్నారు. ఇక సాంబార్ నుంచి పావ్‌బాజీ వరకూ టమాట లేకుండా దేశీ వంటకాలకు రుచి రాదు. వంటింట అంతటి కీలకమైన టమాట ధరలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 150 నుంచి రూ. 180 వరకూ పలుకుతున్నాయి. రికార్డు ధరలతో టమాట అమ్మకాలు పడిపోయినా ధర ఏమాత్రం దిగిరావడం లేదు.
Read More