న్యూఢిల్లీ : ప్రపంచంలో తల్లి ప్రేమకు మించి గొప్పదైనదేమీ ఉండదు. తల్లులు తమకు ఏమీ కావాలని కోరుకోకపోయిన తమ చిన్నారులకు ఎంతైనా చేసేందుకు వెనుకాడరు. తల్లులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వర్షం కురుస్తుండగా తన చిన్నారిని ఓ తల్లి భుజాలపై మోస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
मां तो आखिर मां होती है ❤️🙏 pic.twitter.com/bpY7J8sJMK
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 26, 2022
జిందగీ గుల్జార్ హై అనే పేజ్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 37,000 మందికి పైగా వీక్షించారు. 18 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో ఓ మహిళ వర్షం పడుతున్న వేళ తన కూతురిని భుజాలపైకి ఎక్కించుకుని తీసుకువెళుతుండటం కనిపించింది. పాప వర్షంలో తడవకుండా ఆమె ఓ చేతిలో గొడుగును మోసుకెళుతుంది.
తల్లి ఎప్పటికీ తల్లేనంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో స్పందించారు. వీడియో హృదయాన్ని తాకేలా ఉందని ఓ యూజర్ రాసుకురాగా, ప్రేమకు విస్పష్ట సంకేతమని మరో యూజర్ కామెంట్ చేశారు.