న్యూయార్క్ : తండ్రీ కొడుకులు సరదాగా చేపల వేటకు వెళితే అనూహ్యంగా భారీ తిమింగలం వారి బోట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జాక్ పిల్లర్ అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 54000 మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.
తండ్రీ కొడుకులు బోట్లో ఫిషింగ్‌కు వెళ్లగా ఒక్క ఉదుటున భారీ తిమింగలం వారి బోట్వైపు దూసుకొచ్చింది. హటాత్పరిణామానికి కొడుకు బెంబేలెత్తగా తండ్రి కూల్‌గా ఉన్నాడు. భారీ తిమింగలం ఫుటేజ్..మా బోట్‌ను ఓ వైపు ఢీ కొట్టిందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్‌కు నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి.