న్యూఢిల్లీ : ఒక్కోసారి చిన్నపాటి సంతోషాలు, సర్ప్రైజ్లు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. అలాంటి ఘటనలు మనిషిని భావోద్వేగానికీ గురిచేస్తుంటాయి. ఈ తరహా వీడియో ఒకటి రెడిట్‌లో షేర్ కాగా పలువురిని ఆకట్టుకుంటోంది.
ఈ క్లిప్‌లో ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఆర్టిస్ట్ తనకు ఫుడ్ సర్వ్ చేసిన ఎయిర్ హోస్టెస్ చిత్రపటాన్ని స్కెచ్ వేసి ఆమెకు ఇస్తుండటం కనిపిస్తుంది. తన స్కెచ్‌ను అందుకున్న ఫ్లైట్ అటెండెంట్ సంతోషంతో ఉప్పొంగుతూ ఆర్టిస్ట్‌కు థ్యాంక్స్ చెబుతుండటం కనిపించింది. అటెండెంట్ నుంచి ఆర్టిస్ట్ రిటన్ గిఫ్ట్ అందుకోవడంతో క్లిప్ ముగుస్తుంది. ఆపై మహిళ ఆర్టిస్ట్ స్కెచ్ వేయడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ పోస్ట్‌కు నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. ఆర్టిస్ట్, ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన సంభాషణ పలువురి ముఖాల్లో నవ్వులు పూయించింది. ఓ చిన్న విషయం కొందరి రోజును ఎంత ఆహ్లాదభరితంగా మార్చింది కదా అంటూ నెటిజన్లు రాసుకొచ్చారు.