న్యూఢిల్లీ : చిన్న జంతువు ఎదుట ఓ వ్యక్తి గారడీని ప్రదర్శించిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను బ్యూటెంగేబీడెన్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి పిల్లిని పోలిన జంతువు ముందు మేజిక్ ప్లే చేయడం కనిపిస్తుంది.
Entertaining a quokka.. 😊
🎥 IG: lukeforrester_circus pic.twitter.com/Aw0FiQPIns
— Buitengebieden (@buitengebieden) April 30, 2023
క్వోకాస్గా పిలిచే ఈ తరహా పిల్లులు సాధారణంగా న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. వీటిని అత్యధిక సంతోషకర జంతువులుగా పరిగణిస్తారు. ప్రొఫెషనల్ మెజీషియన్ లూక్ ఫారెస్టర్ తొలుత షేర్ చేశారు. ఈ వీడియోలో జంతువు ముందు ఆ వ్యక్తి తన గారడీ నైపుణ్యాలను ప్రదర్శించడం చూడొచ్చు.
అతడి కళతో జంతువు ఆశ్చర్యానికి లోనవడం కనిపిస్తుంది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి 6.8 లక్షల మందికి పైగా వీక్షించారు. పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. మెజీషియన్ ముందు గందరగోళానికి గురైనట్టు కనిపించిన జంతువు ఆపై సంతోషంతో నవ్వులు చిందించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.
Read More
Ghrelin Hormone | ఆకలిని ప్రేరేపించే గోళీ.. జంతువులపై చేసిన ప్రయోగాలు సఫలం..