Ghrelin Hormone | మసాచుసెట్స్ : గ్రెలిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసి ఆకలిని ప్రేరేపించే గోళీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ చికిత్సలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయార్క్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాలిల్ రామది, ఎంఐటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మెక్ రే ఈ పరిశోధనలు జరిపారు.
సైన్స్ రోబోటిక్స్ జర్నల్లో ఈ అధ్యయన ఫలితాన్ని ప్రచురించారు. మొదట వీరు జంతువులపై ప్రయోగాలు చేశారు. జంతువుల కడుపులో ఎలక్ట్రోసూటికల్ గోళీ ద్వారా విద్యుత్తు ప్రేరణ కలిగించారు. 20 నిమిషాల తర్వాత గ్రెలిన్ హార్మోన్ విడుదల అవడాన్ని వారు గమినించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ముళ్ల బల్లిని ప్రేరణగా తీసుకుని దీన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.