న్యూఢిల్లీ : వెరైటీ ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు ఇటీవల నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని కాంబినేషన్స్ వెగటు పుట్టించేలాగా ఉంటుండగా తాజాగా ఓ వ్యక్తి పిజ్జా పానీపూరి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ముంబైకి చెందిన బ్లాగర్ నిధి పర్మార్ ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన ఈ షార్ట్ క్లిప్‌లో ఓ వ్యక్తి పిజ్జా పానీపూరి తయారు చేస్తూ కనిపించాడు. పానీపూరి పీస్‌లను ఓ కంటెయినర్లో ఉంచి వాటిపై కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్ జోడించాడు.
అందులో రెండు సాస్‌లను, చీజ్‌ను మిక్స్ చేసి ఆపై వేడి సెగ తగిలించి చీజ్ వేసి మరికొంత సాస్‌ను యాడ్ చేసి డిష్‌ను పూర్తి చేశాడు. ముంబైలోని మిరా రోడ్లో ఛటోరపంటి అనే షాపులో ఈ డిష్ అందుబాటులో ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 40 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ ఫుడ్‌పై నెటిజన్ల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి.