న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఎంతటి కఠినాత్ములనైనా కంటనీరు పెట్టించేలా ఉంటాయి. ఇదే తరహాలో తాజా వీడియోలో తండ్రి బర్త్‌డే వేడుకకు విదేశాల్లో ఉన్న కుమారుడు ప్రత్యక్షమై సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ వైరల్ వీడియోను జిందగీ గుల్జార్ హై అనే పేజ్ ట్విట్టర్లో షేర్ చేసింది.
भाई ने कनाडा से आकर अपने पापा को उनके जन्मदिन पर Surprise पर दिया ❤️🎁🥰 pic.twitter.com/a15TiqIdgO
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 13, 2022
ఈ క్లిప్‌లో తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుండగా యువకుడు ఆ టేబుల్ దగ్గరకు వెళ్లి తండ్రిని సర్ప్రైజ్లో ముంచెత్తడం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కంటపడ్డ కుమారుడిని తండ్రి ఆప్యాయంగా హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రీ కొడుకుల కలయిక, ఆత్మీయ ఆలింగనం అక్కడున్న వారందరినీ కట్టిపడేసింది.
బ్రదర్ కెనడా నుంచి వచ్చి తండ్రి బర్త్‌డే రోజున సర్ప్రైజ్ ఇచ్చాడని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ దక్కాయి. కొడుకు పట్ల తండ్రికి ఉన్న నిస్వార్ధ ప్రేమకు ఇది సంకేతమని పలువురు యూజర్లు కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు.