న్యూఢిల్లీ : మేకప్ కోసం ఓ వృద్ధ మహిళ వేచిచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పార్టీ లేదా పెండ్లి కోసం ఆమె ముస్తాబయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు వీడియోలో కనిపించింది. ఫంక్షన్ కోసం తనకు ఎలాంటి మేకప్ కావాలనే విషయం మేకప్ ఆర్టిస్ట్‌తో ఆమె చర్చిస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
మేకప్ ఆర్టిస్ట్ జస్మీన్ కౌన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోకు పది లక్షల పైగా వ్యూస్ లభించాయి. వైరల్ వీడియోలో దేశీ నానీ ఓపికగా కూర్చుని మేకప్ కోసం తన వంతు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ కనిపించారు. పింక్ లెహంగాలో బామ్మ ముస్తాబయ్యారు. పార్టీ కోసం తాను ఎలా రెడీ కావాలని అనుకుంటున్నానో ఆమె వివరిస్తున్న తీరు ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది.
తాను మీ కోసం ఏం చేయాలనుకుంటున్నారని మేకప్ ఆర్టిస్ట్ అడగ్గా, తనకు లైట్‌గా మేకప్ వేస్తే చాలని, మేకప్ లేకుండా కూడా తాను చక్కగా ఉంటానని ఆమె బదులిచ్చారు. మేకప్ అనంతరం ఆమె రియాక్షన్ వినండని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. కామెంట్స్ సెక్షన్ హార్ట్, లవ్ ఎమోజీలతో నిండిపోయింది.