టర్కీ : గాయపడిన పిల్లి నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. తూర్పు టర్కీలోని బిట్లిస్ తత్వన్ స్టేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగ్గా ఈ క్లిప్‌ను ఆస్పత్రి ఫేస్బుక్ అధికారిక పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో బ్లాక్ అండ్ వైట్ క్యాట్ ఆస్పత్రిలోకి వచ్చి తిరుగుతుండటం కనిపిస్తుంది. గాయపడిన పిల్లి తనకు చికిత్స అందించేందుకు ఎవరో ఒకరు వస్తారని వేచిచూస్తుండటం కనిపించింది.
ఆపై క్యాట్‌ను గమనించిన నర్సు అజుచర్ ఒదెమిర్ దానికి వైద్యం సాయం అందించింది. పిల్లి గాయాలను గమనించిన నర్సు బ్యాండేజ్ వేసింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ రాగా పలువురు యూజర్లు కామెంట్స్‌తో రియాక్టయ్యారు.
ఆస్పత్రిలోకి పిల్లి రావడం తాను గమనించానని, దాన్ని దగ్గరకు తీసుకుని పరిశీలించగా కాలికి గాయమైనట్టు గుర్తించి చికిత్స అందించి కొద్దిసేపు ఆస్పత్రిలో ఉంచగా కోలుకున్న క్యాట్ తిరిగి వెళ్లిపోయిందని అబుజర్ ఒదెమిర్ ఓ వార్తాసంస్ధతో చెప్పుకొచ్చారు. అసలు ఆ పిల్లి ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా గాయపడిందనే వివరాలు తెలియరాలేదు.