న్యూఢిల్లీ : స్ట్రీట్‌ఫుడ్‌ను ఎంతోమంది ఇష్టపడుతుంటారు. తక్కువ ధరలో రుచికరమైన ఆహారాన్ని తృప్తిగా ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని ఓ స్ట్రీట్‌లో యువతి చాట్ విక్రయిస్తూ ఫుడ్ బ్లాగర్ కంటపడింది. బాల్యం నుంచి 17 ఏండ్లుగా ఆమె తన తండ్రికి సాయంగా స్ట్రీట్ ఫుడ్‌ను విక్రయిస్తూ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఫుడ్ స్టాల్లో వేగంగా చాట్‌ను వేడివేడిగా కస్టమర్లకు సర్వ్ చేస్తున్న యువతి వీడియో తాజాగా నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 90 లక్షల మంది వీక్షించారు. సహీ హై అనే ఇన్స్టాగ్రాం ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తన షాపు ముందు క్యూ కట్టిన కస్టమర్లకు యువతి ఫుడ్ సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఆలూ టిక్కీ చాట్‌ను ఆమె ప్రిపేర్ చేస్తూ వీడియోలో కనిపించింది. టీ షర్ట్, ప్యాంట్ ధరించిన యువతి ఫుడ్ సర్వ్ చేస్తూ అంకిత భావంతో సేవలందిస్తున్న వీడియో నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.
ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ షాపులో తాను ఆలూ టిక్కీ తింటున్నానని, ఈ వీడియోను షేర్ చేసినందుకు ధన్యవాదాలని ఓ యూజర్ రాసుకొచ్చారు. పంజాబ్‌లోని మోగా సిటీలో తండ్రికి సాయంగా ఆమె షాపులో ఎప్పటినుంచో పనిచేస్తోందని యరో యూజర్ వెల్లడించారు. ఆలూ టిక్కీ ఇక్కడ లభించినంత రుచిగా ఎక్కడా ఉండదని మరో యూజర్ కామెంట్ చేశారు.