న్యూఢిల్లీ : గమ్మత్తైన కాంబినేషన్లతో పలు ఆహార పదార్ధాల వీడియోలను సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్లు హోరెత్తిస్తుంటారు. గతంలో మ్యాగీ ఐస్‌క్రీం నుంచి చాక్లెట్ బిర్యానీ వరకూ వినూత్న ఫుడ్ వీడియోలతో ముందుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ తాజాగా వెనిలా ఐస్‌క్రీంతో ఫ్రెంచ్ ఫ్రైలను ట్రై చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.
ఈ వీడియో ఇప్పటివరకూ 22వేలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ వైరల్ వీడియోలో ఫుడ్ బ్లాగర్ ఐస్‌క్రీంతో ఫ్రెంచ్ ఫ్రైస్ను టేస్ట్ చేయడం కనిపిస్తుంది. ఈ టేస్ట్ ఆమెకు నచ్చినట్టుగా రియాక్షన్స్ ఇవ్వగా ఈ కాంబినేషన్‌కు పదింటికి 9 మార్కులను ఇచ్చేసింది. అయితే నెటిజన్ల నుంచి మాత్రం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఈ ఫుడ్ కాంబినేషన్ బాగుండదని పలువురు యూజర్లు కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చారు.