న్యూఢిల్లీ : వయసు కేవలం శరీరానికే కానీ మనసుకు కాదని ఓ పెద్ద వయసు మహిళ చాటింది. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అనడానికి కూడా ఆమె ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. పంజాబీ సాంగ్స్‌కు అనుగుణంగా హుషారైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఓ మహిళ స్టేజ్‌పై అదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శైల్ శర్మ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో రెడ్ శారీ ధరించిన వృద్ధురాలు పెండ్లి వేడుకలో డ్యాన్స్‌తో దుమ్మురేపుతూ కనిపించారు. ధోల్ జగీరో దా అనే పాటకు తనదైన ఈజ్, గ్రేస్‌తో స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. రేఖ అనే ఈ మహిళ యార్ బోల్దా సాంగ్‌కు కూడా స్టేజీపై తన కిల్లర్ స్టెప్స్‌తో అలరించారు. ఈ వీడియోకు దట్స్ హౌ షి స్టోల్ ది షో అనే క్యాప్షన్ ఇచ్చారు.