న్యూఢిల్లీ : దేశీ భర్తతో కలిసి హర్యాన్వి సాంగ్‌కు ఓ ఆస్ట్రేలియన్ మహిళ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వరల్డ్ ఫేమస్ హర్యాన్వి సాంగ్‌కు వారిద్దరూ హుషారైన స్టెప్స్‌తో ఆకట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ వైరల్ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరూ తమదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా మహిళ సల్వార్ సూట్ ధరించి భర్తతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రేమ కురిపిస్తూ కామెంట్ సెక్షన్లో హార్ట్, లవ్ ఎమోజీలతో హోరెత్తించారు.