Immigration rules | కెనడాలో మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్.. విదేశీ విద్యార్థులకు షాక్..!
Immigration rules | కెనడా (Canada) లో చదువుకుని అక్కడే శాశ్వత నివాసం పొందాలని భావించే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు మానిటోబా ప్రావిన్స్ (Manitoba Province) ఊహించని షాకిచ్చింది. చదువు పూర్తయ్యాక నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ (Permanent Residency) పొందేందుకు ఉపయోగపడుతున్న కీలక ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Immigration rules : కెనడా (Canada) లో చదువుకుని అక్కడే శాశ్వత నివాసం పొందాలని భావించే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు మానిటోబా ప్రావిన్స్ (Manitoba Province) ఊహించని షాకిచ్చింది. చదువు పూర్తయ్యాక నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ (Permanent Residency) పొందేందుకు ఉపయోగపడుతున్న కీలక ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులు, తాత్కాలిక వలసదారుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ కింద అమల్లో ఉన్న ‘కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే’ ను వెంటనే అమల్లోకి వచ్చేలా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు మానిటోబాలో కనీసం ఏడాదిపాటు చదివి, అర్హత కలిగిన ఉద్యోగం సంపాదిస్తే పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ముఖ్యంగా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగించుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇతర ఇమ్మిగ్రేషన్ మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇకపై చదువు మాత్రమే సరిపోదని, స్థానిక ఉద్యోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మానిటోబా స్పష్టంచేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ ప్రోగ్రామ్ కింద కనీసం ఆరు నెలలు ఒకే యజమాని వద్ద పూర్తి స్థాయి ఉద్యోగం చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది. అంటే విద్యార్హతలకంటే ఉద్యోగ అనుభవం, స్థానిక కార్మిక మార్కెట్‌తో అనుసంధానం కీలకంగా మారనున్నాయి. భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రత్యేకంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మానిటోబాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. తక్కువ జీవన వ్యయం, మంచి విద్యాసంస్థలు, సులభమైన పీఆర్ అవకాశాల కారణంగా చాలా మంది ఈ ప్రావిన్స్‌ను ఎంచుకుంటున్నారు.
అయితే తాజా నిర్ణయంతో కెనడాలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఇకపై చదువుతోపాటు ఉద్యోగ అనుభవం సంపాదించడంపైనా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

