న్యూఢిల్లీ: ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై అప్పుడే ఏమీ చెప్పలేమని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాదంపై ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని ప్రజలకు సూచించారు. ‘నివేదికపై విశ్లేషిస్తున్నాం. తుది నివేదికలు త్వరలో వస్తాయని ఆశిస్తున్నా. అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే వీలు ఉంటుంది. పైలట్లు, సిబ్బంది పరంగా ప్రపంచంలో మనకు అద్భుతమైన శ్రామిక శక్తి ఉంది. పైలట్లు, సిబ్బందే విమానయాన పరిశ్రమకు వెన్నెముక’ అని అన్నారు.‘
పైలట్లు లేకుండానే రహస్య దర్యాప్తా?’
న్యూఢిల్లీ, జూలై 12: విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన నివేదికను ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఎఫ్ఏ) ఖండించింది. విచారణ జరిగిన తీరు, నివేదికలో వివరాలు వెల్లడించిన విధానం పైలట్లదే తప్పనే భావనే స్ఫురించేలా పక్షపాత ధోరణితో ఉందని ఆరోపించింది. ఈ దర్యాప్తులో ఎలాంటి పారదర్శకత లేదని, గోప్యంగా దర్యాప్తు ఎందుకు జరిపారని ఆల్ఫా అధ్యక్షుడు సామ్ థామస్ ప్రశ్నించారు.