న్యూఢిల్లీ: ‘సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. అమెరికన్ మెటియరలాజికల్ సొసైటీకి చెందిన సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ యాక్టివిటీస్ కమిషన్ ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఔట్‌స్టాండింగ్ సర్వీస్ అవార్డ్, 2025ను అందజేసింది.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాను హెచ్చరికల వ్యవస్థకు గొప్ప నాయకత్వాన్ని అందించినందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చింది. మహాపాత్ర పీహెచ్డీ చేశారు. ఆయన వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్‌కు భారత దేశ శాశ్వత ప్రతినిధి.