బాగ్పట్, జూలై 21: యూపీలో మత గురువుపై హిందూత్వవాదులు రెచ్చిపోయారు. బాగ్‌పట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇమామ్ హఫీజ్ ముసుబుర్ రెహమాన్ మసీదులో ప్రార్ధనలు చేసుకుని వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అడ్డగించి తుపాకితో బెదిరించారు. హిందూ నినాదాలు చేయడానికి నిరాకరించిన అతనిపై దౌర్జన్యం చేసి కొట్టి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయించారు.
తర్వాత కాషాయ కండువాను అతని మెడలో వేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు బాగ్పట్ ఏఎస్పీ తెలిపారు.